నారాలోకేష్ కు పోలీసులు నోటీసులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు;
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన బసవద్దకు వచ్చిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తిరుపతి నగర వీధుల్లోనూ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ పాదయాత్ర తిరుపతి వీధుల్లో కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
26వ రోజుకు చేరుకున్న....
లోకేష్ పాదయాత్ర నేటికి 26వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ 344.6 కిలోమీటర్ల మేర లోకేష్ నడిచారు. తిరుపతి నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. తిరుపతి అంకుర ఆసుపత్రి వద్ద ఉన్న విడిది కేంద్రం వద్ద తొలుత ఆటో యూనియన్ నేతలతో సమావేశమవుతారు. అనంతరం టీటీడీ ఉద్యోగులతో లోకేష్ సమావేశం కానున్నారు. క్యాంప్ సైట్ లో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం క్యాంప్ సైట్ లో యువతీయువకులతో సమావేశమవుతారు. తిరుపతిలోనే రాత్రి బస చేయనున్నారు.