MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి ముందంజ
గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు;

గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లలో ఈరోజు తెల్లవారు జామున చివరి రౌండ్ పూర్తయ్యే సరికి దాదాపు 82,320 ఓట్లను ఆలపాటి సాధించారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే భారీ ఆధిక్యత రావడంతో ఆయన గెలుపు సాధ్యమయింది. అయితే అధికారుల ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ఆయన గెలుపును అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన పట్టభద్రతుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కూటమికి అనుకూలంగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వచ్చినట్లు అర్థమవుతుంది.