Breaking : గన్ మెన్‌లను వెనక్కు పంపిన టీడీపీ ఎమ్మెల్యే

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు;

Update: 2024-06-27 13:07 GMT
kuna ravikumar, arrest, police, srikakulam
  • whatsapp icon

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూన రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు.

శత్రువులు ఎవరూ లేరని...
తనకు రక్షణగా గన్‌మెన్లు అవసరం లేదన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరన్న కూన రవికుమార్, తాను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశానని, ప్రజల్లో నిత్యం ఉన్నానని తెలిపారు. తనకు గన్‌మెన్లు అవసరం లేదని, వారిని తిప్పిపంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హట్ టాపిక్ గా మారింది. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే తనకు మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News