Andhra Pradesh : ఏప్రిల్ 3న ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఏప్రిల్ 3వ తేదీన జరగనుంది.;

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఏప్రిల్ 3వ తేదీన జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ప్రతి నెల రెండుసార్లు మంత్రి వర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో మూడో తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారరు.
మంత్రి వర్గ సమావేశంలో...
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.