Posani Krishna Murali : పోసాని జైలు నుంచి విడుదల
సినీనటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యారు;

సినీనటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు.పోసాని కృష్ణమురళిపై సీఐడీ నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసాని కృష్ణమురళిని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ను దూషించిన కేసుల్లో గత నెల 26వ తేదీన పోలీసులు అరెస్టయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు...
అయితే ఆయనపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించగా, మరికొన్ని కేసుల్లో బెయిల్ లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్ కు ప్రతి మంగళవారం హాజరు కావాలని షరతుల్లో పేర్కొన్నారు. నిన్న పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించినా పూచీకత్తు సమర్పించడంలో ఆలస్యం కావడంతో కొద్దిసేపటి క్రితం ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.