Vidadala Rajaaini : విడదల రజనీపై ఏసీబీ కేసు
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది.;

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. గత ప్రభుత్వ హయాంలో 2.20 కోట్ల రూపాయలను ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి తీసుకున్నారన్న అభియోగంపై విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖల పేరుతో బెదిరించి అక్రమంగా 2.20 కోట్ల వసూలు చేశారన్న ఆరో్పణలపై కేసు నమోదయింది.
స్టోన్ క్రషర్ నుంచి...
విడదల రజనీతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారిపల్లె జాషుుబావతో పాటు మరిందకొందరిపై కూడా కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా విడదల రజనీని చేర్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు అందిన ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందడంతో దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.