Big Breaking: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌

ఏపీలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు

Update: 2023-09-09 01:54 GMT

ఏపీలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. పలు సెక్షన్ల కింద కేసు నమోద చేశారు. చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. నంద్యాలలోని ఆర్‌కే ఫంక్షన్‌ హల్‌ దగ్గర చంద్రబాబును అరెస్టు చేశారు. ఏ సమయంలోనైనా విజయవాడకు తరలించే అవకాశాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం రేపుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసు అంటే ఏమిటి..?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఆయనను నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు. 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,350 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీకి చెందినటువంటి సీమెన్ అనే సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో ఏకంగా 240 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ల ద్వారా జీఎస్టీకి గండి కొట్టారనే అభియోగాలు సైతం ఉన్నాయి.




 నన్ను కావాలనే అరెస్ట్‌ చేశారు: చంద్రబాబు

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, చాలా బాధేస్తోందని, నన్ను ఏ విషయంలో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పట్టుబట్టినా.. ఎలాంటి విషయాలు తెలుపకుండా అరెస్టు చేశారని అన్నారు. తాను ఏ తప్పు చేశానో నిరూపించాలని, అప్పుడే నన్ను అరెస్టు చేయాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం కుట్రతో నన్ను ఇలా అరెస్టు చేయిస్తోందని మండిపడ్డారు. ఏదీ ఏమైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు. నడిరోడ్డుపై తానను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. రాత్రి నుంచికూడా పోలీసులు ఎంతో ఇబ్బంది పడుతూ మాట్లాడారని, ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉదయం తనను అరెస్టు చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, నేరపూరితమైన పలు సెక్షన్ ల కింద అరెస్టు చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు చేశారు. అలాగే గతంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ సీఐడీ నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ కేసులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు.. 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలకు కూడా చేశారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని.. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. 

Tags:    

Similar News