Chandrababu : చంద్రబాబు చేతి కాఫీ ఎలా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. లబ్దిదారులకు పింఛను పంపిణీ చేస్తున్నారు.

Update: 2024-12-31 07:40 GMT


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. లబ్దిదారులకు పింఛను పంపిణీ చేస్తున్నారు. నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో లబ్దిదారుడి ఇంట్లో స్టౌ వెలిగించి కాఫీ కాచారు. తాను పెట్టిన కాఫీని వారికి కూడా అందించారు. ఉచిత గ్యాస్ వల్లనే ఈ సదుపాయం కలిగిందని చంద్రబాబు అన్నారు. లబ్దిదారులు ఏడుకొండలు ఆర్థిక స్థితగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సొంత ఇంటిని నిర్మించుకోవడం కోసం అక్కడికక్కడే ఐదు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.



శారమ్మ ఇంట్లో...
అలాగే మరో లబ్దిదారులు శారమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందచేశారు. వారి ఇంట్లో కాసేపు ఉన్న చంద్రబాబు వారి యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెను బాగా చదివించాలని నీట్ రాయించాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అదేసయమంలో కుమారుడికి లక్ష రూపాయలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనిన అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News