Chandrababu : నేడు బిల్ గేట్స్ తో బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు;

Update: 2025-03-19 02:02 GMT
chandrababu,  chief minister,  bill gates,  delhi
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి చేరుకుని ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నేడు ఢిల్లీలో బిల్ గేట్స్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒబెరాయ్ హోటల్ లో బిల్ గేట్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నారు.

ఫౌండేషన్ తో ఒప్పందం...
మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అంటే దాదాపు అరగంట సేపు బిల్ గేట్ ఫౌండేషన్ చేపట్టనున్న నూతన కార్యక్రమాల గురించి ఇరువురు చర్చించనున్నారు. బిల్ గేట్ ఫౌండేషన్ రాష్ట్రంలో అమలు చేయనున్న కార్యక్రమ ఒప్పందం చేసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుని అమరావతికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు.


Tags:    

Similar News