Chandrababu : నేడు పెనుకొండకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ లో ఆయన పర్యటన సాగనుంది. ఉదయం పదిన్నర గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన 11 గంటలకు పెనుగొండకు చేరుకుంటారు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో...
వాసవి కన్యాపరమేశ్వరి మాతకు చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. వాసవి కన్యకాపరమేశ్వరిని దర్శించుకుంటారు. అనంతరం ఆయన బయలుదేరి తిరిగి ఉండవల్లికి చేరుకుంటారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెనుగొండలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలమైన హెలిప్యాడ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.