16న పోలవరం ప్రాజెక్టువద్దకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. జనవరి రెండో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయంచింది. జనవరి రెండో తేదీన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.
పనులను ప్రారంభించేందుకు...
ఈ పనులను ప్రారంభించడానికి చంద్రబాబు పోలవరం పర్యటనకు వస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు అందుతుండటంతో వేగిరంగా పనులు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు రానున్నారు.