ఏపీ ప్రభుత్వం క్రిస్మస్ కానుక

ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్లందరికీ కానుకలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమయింది

Update: 2024-12-11 03:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్లందరికీ కానుకలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమయింది. గతంలోనూ క్రిస్మస్ కు ప్రత్యేకంగా చంద్రబాబు ప్రభుత్వం కానుకలను అందించేది. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఆరు నెలలు పూర్తి కావడంతో...
ఏపీలో ఆరునెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వివిధ మతాలకు వారి మతాలకు అనుగుణంగా పండుగ వస్తువులను కానుకగా అందించేవారు. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడంతో క్రిస్మస్ కానుక అందించనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.


Tags:    

Similar News