Andhra Pradesh : ఏపీ హైకోర్టు సీరియస్.. పోలీసులు ఉన్నారా? లేదా?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లు సరిగా ధరించకుండా వాహనాలు నడపకపోవడాన్ని పట్టించుకోవడం లేదన్న పిటీషనర్ పై విచారణ జరిపింది. ఈ నెల జూన్ సెప్టెంబరు వరకూ హెల్మెట్ లేకుండా వాహనాలను డ్రైవ్ చేసినందుకు 667 మంది మరణించారని పిటీషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజాప్రయోజనవ్యాజ్యంపైవిచారణ జరుపుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
ఈ మరణాలకు ఎవరు బాధ్యులు...
ఈ మరణాలకు ఎవరు బాధ్యతవహిస్తారని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ట్రాఫిక్ సిబ్బంది కొరత వల్లనే సక్రమంగా అమలుచేయలేక పోయామని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. హెల్మెట్లు ధరించకుండా వాహనాలను నడుపుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపైవిచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.