Ys Jagan : రేషన్ బియ్యంపై జగన్ సంచలన కామెంట్స్
ఏపీలో రేషన్ బియ్యం ఎగుమతుల అంశం హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై వైఎస్ జగన్ స్పందించారు.
ఏపీలో రేషన్ బియ్యం ఎగుమతుల అంశం హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ప్రకాశం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుందని అధికార పార్టీ ఆరోపిస్తుందని, అయితే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఎవరున్నారని జగన్ ప్రశ్నించారు.
అంతా వారే అయినా...
పోర్టులో కస్టమ్స్ విభాగానికి సంబంధించి వాళ్లేనని, ప్రభుత్వంలో మంత్రులు వాళ్లేనని, అధికారులు వాళ్ల మనుషులేనని, చివరకు చెక్ పోస్టులు కూడా వారు పెట్టినవేనని, భద్రతాసిబ్బంది కూడా వారి వాళ్లేనని, అయినా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా ఆ షిప్ దగ్గరకు మాత్రం వీరు వెళ్లలేదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయని, ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా బియ్యం ఎగుమతుల్లో నిలిచిందన్న వైఎస్ జగన్ అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదని, కానీతప్పుడు ప్రచారంచేస్తూ వైసీపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేషన్ బియ్యం దుర్వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టింది వైసీపీ ప్రభుత్వమేనని వైఎస్ జగన్ అన్నారు.