Chandrababu : తిరుమలలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నా;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ప్రతి ఏడాది తిరుమలకు వస్తారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లు వచ్చారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమలకు వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు.
అన్నదానానికి...
దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు నాడు అన్న ప్రసాదానికిఒకరోజు అయ్యే ఖర్చు నలభై నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇవ్వనుంది. చంద్రబాబు రాక సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు తిరిగి తిరుమల నుంచి బయటులుదేరి అమరావతికి చేరుకుంటారు.