Chandrababu : నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెజవాడలోనికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారుబందరురోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియంవద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఉదయం ఐదు గంటలనుంచిసాయంత్రం నాలుగు గంటల వరకూ బందరు రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. స్టేడియంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.