Chandrababu :ఈ నెల 20 నుంచి దావోస్ చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్‌లో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలో తొమ్మిది మంది బృందం పాల్గొననుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో ఈ సదస్సులో సమావేశమయి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అన్ని వివరాలను అందించనున్నారు.
పెట్టుబడులకు సంబంధించి...
రాష్ట్రంలో లభించే వనరులు, పెట్టుబడి అవకాశాలను వీరు ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని దావోస్ పర్యటన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సీఎం సెక్యూరిటీ అధికారి శ్రీనాథ్ బండారు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయి కాంత్ వర్మ, కాడా పీడీ వికాస్ మర్మత్ లు పాల్గొననున్నారు.