Chandrababu : నారావారిపల్లిలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.;

Update: 2025-01-13 03:10 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులందరూ కలసి సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నారావారి పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నారావారిపల్లిలో 15 ఈ ఆటోలు, కొత్త సీసీ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

పలు అభివృద్ధి పనులకు...
దీంతో పాటు నారావారిపల్లెలో సబ్ స్టేషన్, ఎ. రంగంపేటలోని హైస్కూల్ లో రూ. కోటితో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి భూమిపూజ వంటివి నిర్వహించనున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటిముందు స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహావిష్కరణ చేయనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లిలో సంక్రాతి సందడి నెలకొంది.


Tags:    

Similar News