గుంటూరులో స్మార్ట్ మీటర్ల బిగింపు...ఆందోళనలో ప్రజలు

గుంటూరులో దొంగతనంగా విద్యుత్ మీటర్లు మార్పిడి చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు;

Update: 2025-01-13 12:21 GMT

గుంటూరులో దొంగతనంగా విద్యుత్ మీటర్లు మార్పిడి చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీటర్లు సిబ్బందిమారుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంటి యజమానులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అయితే తాము లైన్ మ్యాన్ చెపితేనే తాము మీటర్లు మారుస్తున్నాం అని సిబ్బంది చెబుతున్నారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఇళ్ళల్లోకి చొరబడి ఎవరు లేని సమయంలో విద్యుత్ మీటర్లు మార్చడంపై గుంటూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ లేని సమయంలో...
గుంటూరు అరండల పేటలో నివాసంలో చెప్పా పెట్టకుండా ఎవరూ లేని సమయంలో మీటర్లు మార్తున్నారని ఆరోపిన్తున్నారు. మీటర్లు మార్చాలని ఇంటి యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్తు మీటర్లను మార్చడమేంటని నిలదీస్తున్నారు. సంక్రాంతి పండుగ పూట ఇళ్ళకి తాళాలు వేసి ఊరికి వెళ్ళిన వాళ్ళకు కూడా తెలియకుండా మీటర్లు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నివాసంలో ఏదైనా దొంగతనం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని నిలదీస్తున్నారు.


Tags:    

Similar News