ఏపీలో ఐపీఎలస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు;
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా నియమితులయ్యారు. నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదుగురు అధికారులను...
అలాగే కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్ నియమితలయ్యారు. తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీయినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న వెంటనే వారు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.