హైకోర్టులో జగన్ కు ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది.;

Update: 2022-03-30 01:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ 2014లో జగన్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది.

వ్యక్తిగత హాజరు నుంచి.....
అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేశారు.


Tags:    

Similar News