నేడు మాచర్లకు బుద్దా వెంకన్న... టెన్షన్ తప్పదా?
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నేడు మాచర్లకు వెళ్లనున్నారు. దీంతో మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు;
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నేడు మాచర్లకు వెళ్లనున్నారు. దీంతో మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన బుద్దా వెంకన్న తాను రేపు మాచర్ల ఒంటరిగా వెళుతున్నానని, దమ్ముంటే తనపై దాడి చేయాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు.
స్థానిక ఎన్నికల సమయంలో...
గతంలో తనపై దాడి చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాచర్ల వెళ్లిన తమ వాహనంపై దాడులకు దిగారని, తమను హత్యచేసేందుకు ప్రయత్నించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా నిందితుడిగా చేర్చివిచారించాలని ఎస్పీని కోరారు. ఇదే విషయంపై మాచర్ల డీఎస్పీని కలిసేందుకు బుద్దా వెంకన్న నేడు మాచర్ల వెళుతుండటంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.