Ys Jagan : నేడు పులివెందులకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు;

Update: 2024-05-12 04:48 GMT
Ys Jagan : నేడు పులివెందులకు జగన్
  • whatsapp icon

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు జరిగే శాసనసభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈరోజు పులివెందులకు జగన్ తన సతీమణితో కలసి బయల్దేరనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు బయలుదేరి జగన్ దంపతులు పులివెందులకు చేరుకుంటారు. ఈరోజు, రేపు పులివెందులలోనే జగన్ దంపతులు తమ సొంత నియోజకవర్గంలో ఉండనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు.

రేపు ఓటు వేసి...
జగన్ దంపతులు రేపు తమ ఓటు హక్కును పులివెందులలో వినియోగించుకోనున్నారు. ఈరోజు రాత్రికి పులివెందులలోనే బస చేసి రేపు పోలింగ్ కేంద్రానికి ఉదయాన్నే వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ రెండో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న జగన్ ఎన్నికల ప్రచారానికి సమయం పూర్తి కావడంతో ఆయన పులివెందులకు చేరుకుని కొంత విశ్రాంతి తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.


Tags:    

Similar News