Ys Jagan : 23న ఉరవకొండకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు;

Update: 2024-01-20 02:52 GMT
ys jagan, chief mnister, ongole, house pattas

chief minister ys jagan

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను ఆయన పంపిణీ చేయనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న జగన్ కు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగో విడత నిధులను...
వైఎస్సార్ నాలుగో విడత ఆసరా నిధులను పంపిణీ చేయడానికి ముందు ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు పెద్దయెత్తున జనాలను తరలించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.


Tags:    

Similar News