Liquor : మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్
మందు బాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది
మందు బాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఈమేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు.
బాటిల్ పై పది రూపాయలు...
దీంతో ఎమ్మార్పీ ధర 150.50 రూపాయలు ఉంటే 160 రూపాయలకు పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో మద్యం సేవించే వారికి అదనపు ఫీజు భారంగా మారనుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.