రాజధాని అభివృద్ధికి మరో నాలుగేళ్లు గడువివ్వండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఆర్డీఏ పనుల పూర్తి విషయంలో హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఆర్డీఏ పనుల పూర్తి విషయంలో హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఆరు నెలల్లో సీఆర్డీఏ పనులు, మూడు నెలల్లోగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఈ నెల 3వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. దీంతో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హైకోర్టులో 190 పేజీల అఫడవిట్ ను దాఖలు చేశారు.
హైకోర్టులో ప్రభుత్వం అఫడవిట్.....
గత ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 42 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, దానికి వడ్డీలను ప్రభుత్వం చెల్లిస్తుందని అఫడవిట్ లో పేర్కొన్నారు. సీఆర్డీఏ అభివృద్ధికి మరో నాలుగేళ్లు గడువు ఇవ్వాలని కోరారు. 2024 జనవరి వరకూ రాజధాని అమరావతి అభివృద్ధికి గడువు ఉందని అఫడవిట్ లో పేర్కొన్నారు. మరీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.