Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి వేళ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి వేళ గుడ్ న్యూస్ తెలిపింది.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి వేళ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై లేఔట్లు, భవన నిర్మాణాల అనుమతులు ఇక పంచాయితీ, మున్సిపాల్టీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు ఎకరాల వరకు లేఅవుట్ అనుమతులు స్థానిక సంస్థలకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నిబంధనలు ఇవీ...
మూడు ఎకరాల పైబడిన లేఔట్లకు డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామాల్లో పంచాయతీలకే పెత్తనం అప్పగించింది. మూడు చదరపు మీటర్లు ప్లాట్, పది మీటర్ల నివాస భవనాల నిర్మాణాలకు అనుమతి పంచాయతీలే ఇవ్వనున్నాయి. ఈ ఉత్తర్వులతో స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినట్లయింది.