ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ...వారికి యాభై శాతం రాయితీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. ఏపీలో ఆస్తి పన్ను పై పై వడ్డీలో రాయితీని కల్పిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని పన్ను బకాయీదారులందరూ వినియోగించుకోవాలని కోరింది.
వడ్డీలో డిస్కౌంట్ ఈ నెలాఖరు వరకూ....
ఆస్తి పన్ను పై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ తీసుకున్న నిర్ణయంతో చాలా మందికి ఊరట దక్కే అవకాశముందని చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకూ పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేయడం ఊరట నిచ్చే విషయమని అంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు,పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం రాయితీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.