Free Gas Cyllender : గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్ లో పడటం లేదా? ఇదే కారణమట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది. ముందుగా డబ్బులు చెల్లిస్తే తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ కోటి మంది వరకూ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు. దీపం2 పథకం కింద అమలు చేసే ఈ స్కీమ్ లో కొందరికి డబ్బులు తమ అకౌంట్లలో జమ కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండటం లేదు. అందుకే అధికారులు డబ్బులు తమ అకౌంట్ లో పడని వారు సింపుల్ గా ఇలా చేయాలని సూచిస్తున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ ను...
2024 నవంబరు ఒకటి నుంచి దీపం-2 పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనుంది. ఉచితంగా పంపిణీ చేయడంతో ఎక్కువ మంది లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీపం పథకం 2 పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 2452 రూపాయలు రాయితీ వస్తోంది. ఏడాదిలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున తొలి విడతగా 2025 మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకునే వీలు కల్పించారు. కానీ సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాల నమోదులో చిన్న, చిన్న తప్పులతో లబ్ధిదారులకు రాయితీ డబ్బులు రావడం లేదని అధికారులు తెలిపారు.
ఇవే కారణాలు...
అయితే డబ్బులు లబ్దిదారుల అకౌంట్లలో పడకపోవడానికి కారణం ఈకేవైసీ చేయించుకోకపోవడం అని అధికారులు చెబుతున్నారు. అలాగే వారికి ఎక్కువగా విద్యుత్తు బిల్లులు వచ్చినా డబ్బులు పడవని అంటుున్నారు. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేయకపోయినా, ఒక తెపు రంగు కార్డుపై రెండు గ్యాస్ కనెక్షన్లుఉన్నా ఆ అకౌంట్లలో డబ్బులు పడవని అధికారులు తెలిపారు. వీటిని అధిగమిస్తే లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు. 1967 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పినా వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారని, ప్రభుత్వ ఉద్యోగులైనా, కారు కలిగి ఉన్నా, 300 యూనిట్లకు పైగా విద్యుత్తు ను నెలవారీ వినియోగించినా అటువంటి వారికి డబ్బులు జమ కావు. వారికి ఈపథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు. అందుకే లబ్దిదారులు ఇలాంటి చిన్న తప్పులు లేకుండా సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.