Andhra Pradesh : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ కార్డు తీసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేకంగా శిబిరాలను నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కొత్తగా ఆధార్ కార్డును తీసుకునే వారికి నిజంగా ఇది శుభవార్త. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డును తమకు సమీపంలో ఉన్న కేంద్రాల వద్ద పొందే అవకాశముంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ ఆధార్ కేంద్రాలు నాలుగు రోజుల పాటు పనిచేయనున్నాయి.
నాలుగు రోజుల పాటు...
ప్రతి గ్రామ సచివాలయం, గ్రామ వార్డు సచివాలయాల కార్యాలయంతో పాటు, కళాశాలలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో ఈ సౌకర్యం ఉంటుందని తెలిపింది. కొత్తగా ఆధార్ కార్డును నమోదు చేసుకునే వారు ఎవరైనా ఈ కేంద్రాలకు వచ్చి నమోదు చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం బాధ్యులుగా మున్సిపల్ కమిషనర్లను, మండల పరిషత్ డెవలెప్ మెంట్ ఆఫీసర్లను నియమించిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ శిబిరాల్లో కొత్త ఆధార్ నమోదుతో పాటు, బయోమెట్రిక్ అప్ డేట్, డెమోగ్రాఫిక్ అప్ డేట్, ఈ ఆధార్ వంటివి కూడా చేసుకునే వీలుంది.