Ys Jagan : జగన్ ఇంటి పక్కనుంచే ఇక రయ్ మని వెళ్లొచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని తెరిచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని తెరిచింది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేవారు ఈ రహదారిని ఉపయోగించుకునే వీలు కలిగింది. మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండటంతో ఆయనకు భద్రత కల్పించాల్సి రావడంతో ఆ రహదారిని పోలీసులు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు ఐదేళ్ల నుంచి ఆ రహదారి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.
ఓటమి చెందడంతో...
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన ఇంటి పక్క నుంచి వెళ్లే రహదారిని పోలీసులు తెరిచారు. అటు వైపు నుంచి ప్రజలు ఇక నేరుగా మంగళగిరి, ఉండవల్లికి చేరుకునే వీలుంది. రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని రకాల వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా మూసివేసిన ఈ రహదారిని ఐదేళ్ల తర్వాత తెరుచుకుంది. ఇప్పటి వరకూ అక్కడ ఉంచిన బ్యారికేడ్లను తొలిగించిన పోలీసులు ప్రజలు వెళ్లేందుకు అనుమతిచ్చారు.