Tirumala : తిరుమలలో నేడు పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ నేడు చాలా తక్కువగా ఉంది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అస్సలు లేదనే చెప్పాలి

Update: 2024-12-11 03:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు చాలా తక్కువగా ఉంది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అస్సలు లేదనే చెప్పాలి. శ్రీవారి దర్వనం చాలా సులువుగానే అవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శనం లభించడమే కాకుండా ఎక్కువ సేపు స్వామి వారి చెంత ఉండే అవకాశం కూడా లభిస్తుందని చెబుతున్నారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు, భారీ వర్ష సూచనతో తిరుమలలో రద్దీ తక్కువగా ఉందని చెబుతున్నారు. డిసెంబరు నెల కావడంతో ఎక్కువ సంఖ్యలో తిరుమలకు భక్తులు రావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఇంకా తిరుమలకు రద్దీ పెరగలేదు. ప్రస్తుతం శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో సాధారణ సంఖ్యలోనే భక్తులు తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదీ చుట్టు పక్కల ప్రాంతాల వారు మాత్రమే వచ్చిశ్రీవారిని దర్శించుకుంటున్నారు. దూర ప్రాంత ప్రయాణికులు మాత్రం తిరుమల వచ్చేందుకు వర్ష సూచనతో కొంత వెనకడగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే తిరుమలలో గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడానికి కారణమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు.



 


ఒక కంపార్ట్ మెంట్ లోనే....
రేపటి నుంచి తిరిగి రద్దీ ఎక్కువయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా అధికారులు చెబుతున్నారు. తిరుమలలో రద్దీ లేకపోవడంతో కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంట్లలో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,064 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం 4.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.



Tags:    

Similar News