హైకోర్టులో జాస్తి కృష్ణకిషోర్ కు రిలీఫ్

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ పై సీఐడీ నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.;

Update: 2022-07-19 07:19 GMT

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ పై సీఐడీ నమోదు చేసిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవోగా ఉన్నప్పుడు జాస్తి కృష్ణకిషోర్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. సస్పెండ్ కూడా చేసింది. అయితే దీనిపై జాస్తి కృష్ణకిషోర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. సీఐడీ పెట్టిన కేసులన్నీ కొట్టివేసింది.

కేసులన్నీ కొట్టివేత....
గతంలో ఈడీబీ సీఈవోగా ఉన్నప్పుడు జాస్తి కృష్ణకిషోర్ అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులందాయి. ఈడీబీలోని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, పరిధి దాటి కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా కేసులన్నీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.


Tags:    

Similar News