Andhra Pradesh : రేపు బ్లాస్ట్ అయ్యే న్యూస్ అదేనా? టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ లో రేపు పెను సంచలన వార్త వినబోతున్నారు. టీడీపీ ఎక్స్ లో చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది;

Update: 2024-10-23 12:28 GMT
TDP announcement news, andhra pradesh politics latest news, TDP latest News,  andhra pradesh latest news telugu, chandrababu naidu latest updates, tdp  X post viral news

TDP

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో రేపు పెను సంచలన వార్త వినబోతున్నారు. దానిని ముందుగా చెప్పకుండా స్టే ట్యూన్డ్‌ అంటూ టీడీపీ తన అధికారిక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏపీలో రేపు మరో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందన్న చర్చ జరుగుతుంది. అక్టోబరు 24వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్ కమింగ్ ఆన్ 24 అక్టోబరు 12 పీఎం స్టే ట్యూన్డ్ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా ట్వీట్ చేయడంతో అందరూ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వైపు చూస్తున్నారు. కొందరయితే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మరీ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.


పార్టీ పరంగానా?
అంతేకాదు తమకు పరిచయం ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలు కాల్ చేసి ఈ బిగ్ న్యూస్ ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదేమీతమకు తెలియదని మంత్రులు సమాధానమిస్తుండటంతో వారు ఉసూరుమంటున్నారు. ఏదో పెద్ద వార్తను ప్రకటించబోతున్నారన్నది మాత్రం ఎక్స్ లో టీడీపీ చేసిన ట్వీట్ ద్వారా అర్ధమవుతుంది. అయితే అది పార్టీ పరంగానా? లేక ప్రభుత్వ పరంగానా? అన్నది మాత్రం సస్పెన్స్ లో ఉంది. పార్టీ పరంగా అయితే రాజ్యసభ సభ్యుల ప్రకటన ఉండే అవకాశముంటుందని కొందరు గెస్ చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు రాజ్యసభ పదవులకు పేర్లను చంద్రబాబు వెల్లడించే అవకాశముందని చెబుతుండగా, అది బ్లాస్టింగ్ న్యూస్ ఎలా అవుతుందని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు స్వయంగా...
మరోవైపు ప్రభుత్వ పరంగా నిర్ణయం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారా? అన్నది కూడా తెలియకుండా ఉంది. అనేక విషయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడిప్పుడే మరొక పథకాన్ని అమలు చేసే అవకాశం లేదు. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకాన్ని ఎటూ ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇక ఇటీవలే లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడి వచ్చారు. దానికి సంబంధించి ఏదైనా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్న ప్రకటన చేస్తారా? అన్నది కూడా చర్చల్లో ఒకటిగా ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మరో బలమైన హామీ లభించి ఉంటుందని, దానిని రేపు చంద్రబాబు స్వయంగా ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇటు పార్టీ పరంగానా? ప్రభుత్వం పరంగా వచ్చే ప్రకటన ఎలా ఉంటుదన్న దానిపై మాత్రం టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News