Summer Effect : ఈరోజు, రేపు బయటకు రాకపోవడమే మంచిది

నేడు 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.;

Update: 2024-04-06 02:23 GMT
Summer Effect : ఈరోజు, రేపు బయటకు రాకపోవడమే మంచిది
  • whatsapp icon

నేడు 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. , 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 44 మండలాల్లో తీవ్ర, 193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఈరోజు తీవ్రవడగాల్పులు...
వీచే అవకాశం ఉన్న మండలాలు ఇవే... శ్రీకాకుళం , విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతిలోని కొన్ని మండాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాబోవు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.


Tags:    

Similar News