నా జైలు గదిలో ఏకంగా సీసీ కెమెరా పెట్టారు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ఎవరూ కూడా తప్పించుకోలేరని

Update: 2024-10-09 15:38 GMT

గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ఎవరూ కూడా తప్పించుకోలేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయితే వారందరికీ  సరైన సమయంలో బుద్ధి చెబుతామని అన్నారు. గత ప్రభుత్వంలో తనను కూడా ఎంతగానో ఇబ్బందులు పెట్టారని అన్నారు. తాను కక్ష తీర్చుకోవాలని అనుకోలేదని, అలాంటి మనస్తత్వం తనది కాదని చంద్రబాబు తెలిపారు. తన ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా పెట్టారని, కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర కూడా లేదన్నారు చంద్రబాబు. గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు తనకు తెలుసన్నారు చంద్రబాబు.

గత పాలకులు రూ.10.50 లక్షల కోట్ల అప్పులను చేశారన్నారు సీఎం చంద్రబాబు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని, ఆదాయ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని అన్నారు. అసభ్యతకు మారుపేరుగా వైసీపీ తయారైందని, నేరాలు ఘోరాలు చేయడం, బూతులు మాట్లాడటం వైసీపీ పేటెంట్ హక్కుగా మారిందని విమర్శించారు చంద్రబాబు. విమర్శలు ప్రజాహితం కోసం ఉండాలి, కొందరు ఎందుకు విమర్శిస్తారో తెలీదు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మార్పు రాలేదని అన్నారు.




Tags:    

Similar News