విశాఖలో సీఎం జగన్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూశారా?
విశాఖపట్నంలో 'విజన్ విశాఖ' సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు
విశాఖపట్నంలో 'విజన్ విశాఖ' సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వైజాగ్ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామనీ.. దాని ప్రభావం ఇప్పటికీ మన రాష్ట్రంపై కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే హైదరాబాద్‌ను మించి అభివృద్ధిలో దూసుకెళ్తుందని సీఎం జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు.
విశాఖపట్నం అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదని అన్నారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందని.. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామని.. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామని వివరించారు.