ఈరోజు ఏపీలో తీవ్ర వడగాలులు వీస్తాయట

ఆంధ్రప్రదేశ్ లోని అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.;

Update: 2024-04-10 08:12 GMT
ఈరోజు ఏపీలో తీవ్ర వడగాలులు వీస్తాయట
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లోని అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు పదకొండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు పదహారు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

బయటకు రాకుండా...
వీలైనంతవరకు ప్రజలు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. చల్లని పానీయాలు తాగాలని సూచించారు. మజ్జిగ తాగితే మంచిదని సూచించారు. వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News