నేడు 116 మండలాల్లో వడగాలులు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు 116 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.;

kerala high temperature
ఆంధ్రప్రదేశ్‌లో నేడు 116 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసర పనులు మీద బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
ఈ జిల్లాల్లోనే ...
అల్లూరి సీతారామ జిల్లాలో ఏడు మండలాలు, అనకాపల్లిలో జిల్లాలో పదిహేను మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలు, ఏలూరు జిల్లాలో నాలుగు, గుంటూరు జిల్లాలో ఆరు, కాకినాడ జిల్లాలో తొమ్మిది జిల్లాలు, కృష్ణా జిల్లాలో ఆరు. నంద్యాల జిల్లాలో నాలుగు, ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను, పల్నాడు జిల్లాలో రెండు, పార్వతీపురం మన్యం జిల్లాలో పది, శ్రీకాకుళం జిల్లాలో మూడు మండలాలు, విశాఖపట్నం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో పదమూడు, వైఎస్ఆర్ కడప జిల్లాలో పదమూడు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు.