నిధుల్లేవు.. పథకాన్ని అందుకే నిలిపేశాం
దుల్హన్ పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఏపీ సర్కార్ హైకోర్టుకు వెల్లడించింది.
దుల్హన్ పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఏపీ సర్కార్ హైకోర్టుకు వెల్లడించింది. దుల్హన్ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ పథకం అమలుపై హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది.
పేద ముస్లిం యువతులకు...
దుల్హన్ పథకాన్ని నిధుల లేమి కారణంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. పేద ముస్లిం యువతులకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేస్తుంది. వివాహం చేసుకునే సమయంలో ప్రతి పేద ముస్లిం యువతికి యాభై వేల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే ఈ పథకాన్ని నిలిపేశామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.