ఏపీలో నైరుతి గాలుల ఎఫెక్ట్.. రానున్న మూడ్రోజుల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ పై నైరుతి గాలుల ప్రభావం పడనుంది. ఆ దిశ నుంచి వీచే గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండటంతో..
ఆంధ్రప్రదేశ్ పై నైరుతి గాలుల ప్రభావం పడనుంది. ఆ దిశ నుంచి వీచే గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండటంతో.. రానున్న మూడ్రోజుల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Also Read : రెచ్చిపోతున్న మావోలు.. వంతెన పేల్చివేత
ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.