24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం

రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ బిఆర్ అంబేద్కర్ తెలిపారు;

Update: 2022-09-07 12:28 GMT
24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం
  • whatsapp icon

రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వాతావరణ సూచనల ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈరోజు రాత్రి నుంచి రానున్న రెండు రోజుల పాటు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అతి భారీ వర్షాలు...
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ఆయన తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Tags:    

Similar News