సీఎం సభకు వెళ్లిన ఆర్టీసీ బస్సు మిస్సింగ్.. మిస్టరీ వీడిందిలా

ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో సీఎం పాల్గొనే బహిరంగ

Update: 2024-02-28 11:46 GMT

చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 26న సీఎం జగన్ మోహన్ రెడ్డి సభ జరిగిన సంగతి తెలిసిందే!! ఇలాంటి సభలకు జనసమీకరణ కోసం బస్సులను ఉపయోగిస్తూ ఉంటారు. తిరుపతిలోని అలిపిరి డిపోకు చెందిన బస్సులను కూడా పంపించారు. అయితే ఓ బస్సు మాత్రం ఎక్కడ ఉందో తెలుసుకోలేక అధికారులు తికమక పడ్డారు. అయితే జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో.. ఆ బస్సు దగ్గరకు చేరుకోగలిగారు. ఇదంతా సదరు బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకమని తెలుసుకున్నాక షాక్ అయ్యారు.

ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో సీఎం పాల్గొనే బహిరంగ సభకు అలిపిరి డిపోకు చెందిన ఏపీ03జడ్‌ 0255 నంబర్‌ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఫిబ్రవరి 25న ఆదివారం సాయంత్రం కుప్పం వెళ్లింది. సోమవారం సభ ముగిసిన తర్వాత తిరిగి బస్సు డిపోకు రాలేదు. దీంతో డ్రైవర్‌ను సంప్రదించేందుకు యత్నించినా ఫలితం రాలేదు. అధికారులు బస్సు ఆచూకీ కోసం జీపీఎస్‌తో వెతికించారు. ఆ బస్సు వి.కోట మండలం చింతలగుంటలోని ఓ ఇంటి ఎదుట నిలిపి ఉందని తెలుసుకున్నారు. అదే ఊరికి చెందిన ఆర్టీసీ డ్రైవరు తన ఇంటి దగ్గరే బస్సు నిలిపి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆయనే బస్సును తెచ్చి ఇంటి దగ్గర ఉంచినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన డిపోకు బస్సును తీసుకుని వెళ్లకుండా.. ఎందుకు ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళారనే విషయం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News