శబరిమలలో భక్తుల ప్రవేశానికి నో ఎంట్రీ

భారీ వర్షాల దెబ్బకు ఆలయాల్లో భక్తుల రాకపై నిషేధం విధిస్తున్నారు. శబరిమల దేవస్థానానికి భక్తులకు నో ఎంట్రీ చెప్పేశారు

Update: 2021-11-20 05:24 GMT

భారీ వర్షాల దెబ్బకు ఆలయాల్లో భక్తుల రాకపై నిషేధం విధిస్తున్నారు. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లను, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. ఇక కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానానికి కూడా భక్తులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఈ ఒక్కరోజు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

భారీ వర్షాలతో....
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళానాడు, కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. శబరిమల ఆలయం సమీపంలోని పంబా నదిలో కూడా నీటి ప్రవాహం పెరిగింది. భక్తులు ఎవరూ పంబా నదిలో స్నానం చేయడానికి దిగవద్దని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన శబరిమల ఆలయాన్ని తెరవడంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుంటున్నారు. ఈరోజు దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు శబరిమల కింద తలదాచుకున్నారు.


Tags:    

Similar News