టీడీపీ విన్నూత్న నిరసన

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ విన్నూత్నంగా నిరసన తెలిపింది

Update: 2023-03-19 05:48 GMT

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ విన్నూత్నంగా నిరసన తెలిపింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ బాదుడు 57వేల కోట్లు భారం వేసిన ప్రభుత్వం అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు రైతులు మెడకు ఉరితాళ్లు అనే నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలుకు ర్యాలీ గా వచ్చారు.

ఉపాధి అవకాశాలపై...
ఆదివారం నాటి బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా యువత - ఉపాధి అవకాశాలపై చర్చ జరగనుంది. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, తద్వారా యువతకు పెరగనున్న ఉపాధి అవకాశాలపై మాట్లాడనున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూనే ఉంది.


Tags:    

Similar News