కృష్ణా నదికి వరద తగ్గింది.. సంతోషించేలోగా గోదావరికి పెరుగుతుంది
కృష్ణా నదకి వరద నీరు విడుదల తగ్గుముఖం పడుతున్న దశలో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలుగుతుంది.
కృష్ణా నదికి వరద ఉదృతి తగ్గుతుంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు విడుదల తగ్గుముఖం పడుతున్న దశలో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలుగుతుంది. నిన్నటి వరకూ విజయవాడతో పాటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. విజయవాడ దారుణంగా వరదల దెబ్బకు నష్టపోయింది.
ప్రస్తుతం ఇన్‌ఫ్లో...
అయితే తిరిగి గోదావరికి వరద పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే స్వల్పంగానే వరద పెరుగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మీట్టం ఉండగా, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.