ఒమిక్రాన్ కు భయపడాల్సిన పనిలేదు...నా వద్ద మందు ఉంది
ఒమిక్రాన్ వేరియంట్ కు తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం సహకరిస్తే ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు;
ఒమిక్రాన్ వేరియంట్ కు తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం సహకరిస్తే ప్రజలకు పంపిణీ చేస్తానని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య స్పష్టం చేశారు. ఆయన అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా భయపడాల్సిన పనిలేదన్నారు. తన వద్ద మందు ఉందని, అయితే ప్రజలకు మందును పంపిణీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య కోరారు.
కొత్త రాజకీయ పార్టీ....
ఇక ఏపీలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. ఆనందయ్య ప్రస్తుతం ఏపీ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. అందరిని కలుపుకుని కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు ఈ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆనందయ్య తెలిపారు.