జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై బాబాయ్ ఏమన్నారంటే?

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదంపై బాబాయి వైవీ సుబ్బారెడ్డి స్పందించారు

Update: 2024-10-25 12:45 GMT

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదంపై బాబాయి వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ కుట్రలో వైస్ షర్మిల ఒక పావుగా మారిందని వైవీ అన్నారు. గతంలో జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ లు కలసి జగన్ పై కేసులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టులో స్టేటస్ కో ఉన్న కొన్ని షేర్లను జగన్ షర్మిలకు బదిలీచేశారన్నారు. జగన్ బెయిల్ రద్దును చేసే కుట్రలు జరుగుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నవంబరు 2019 లోనే జగన్ తన ఆస్తులను పంపకాలపై ఎంవోయూ చేశారని గుర్తు చేశారు.

పదేళ్ల నాటి నుంచి...
ఆస్తుల వివాదంలో పదేళ్ల నాటి నుంచి ఏ నాడూ వైఎస్ షర్మిల స్పందించలేదన్నారు. వైఎస్ షర్మిల జగన్ ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక ఆయన బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారో చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు జగన్ పైనే ఎందుకు పెట్టారు? షర్మిల పై ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. షర్మిలకు వాటా ఉన్నప్పుడు ఆమెపై కూడా కేసులు పెట్టాలి కదా? అని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయడానికి చంద్రబాబు చేసే కుట్రలో భాగంగానే వైఎస్ షర్మిల ఇటువంటి ఆరోపణలకు దిగారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖ్ రెడ్డి బతికున్నప్పుడే జగన్ పెట్టిన కంపెనీల్లో షర్మిల కానీ, ఆయన భర్త కానీ డైరెక్టర్ గా లేరన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన ప్రేమను నలుగురు పిల్లలకు పంచారు తప్పించి, ఆస్తులను పంచలేదని తెలిపారు.


Tags:    

Similar News