ఏడు రెట్లు ధర పెంచుతారా?
దేవాదాయ ధర్మాదాయ శాఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు
దేవాదాయ ధర్మాదాయ శాఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండి పడ్డారు. కాణిపాకం వినాయకుడి అభిషేకం ధరను ఏడురెట్లను పెంచడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పెంపుదలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాణిపాకంలో వినాయకుడి అభిషేకం ధరను రూ.750 ల నుంచి రూ.5000లకు పెంచడమేంటని ఆయన ప్రశ్నించారు. అలా పెంచే హక్కు ఎవరిచ్చారంటూ దేవాదాయ శాఖను నిలదీశారు
హిందూ మతంపై....
ధరను పెంచడం వెనక హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ధ్వేషం వెళ్లగక్కుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ద్వారక తిరుమలకు వచ్చే భక్తులకు పులిహారతోనే సరిపెడుతున్నారన్నారు. పొంగలి, వడ తదతర ప్రసాదాలను భక్తులకు పర్వదినాల్లో ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.