కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు

నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు అయింది;

Update: 2025-03-25 03:21 GMT
kakani govardhan reddy,  former minister, case, nellore

kakani govarthan reddy

  • whatsapp icon

నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కోట్ల విలువైన క్వార్జ్‌ దోపిడీ చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో లీజు సమయం ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయింది. గనుల శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

250 కోట్ల రూపాయల విలువైన...
250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ను కాకాణి గోవర్థన్ రెడ్డి తరలించారని ఫిర్యాదు అందింది. దీంతో కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కేసులో ఏ4గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి 120బీ, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News